
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో పూర్తిస్థాయి టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులుగా తగరం సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్లాపూర్ మెట్ కి చెందిన పల్లె వెంకన్న, జాయింట్ సెక్రటరీగా మాకం గంగాధర్ ఎన్నికయ్యారు . 2009 నుండి తెలంగాణ మలిదశ ఉద్యమంలో జర్నలిస్టులను సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(TJF) ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక జర్నలిస్ట్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తగరం సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులుగా రెండోసారి, పల్లె వెంకన్న జిల్లా సంయుక్త కార్యదర్శిగా రెండోసారి, మాకం గంగాధర్ నేత గతంలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేసి ఇ ప్రస్తుతం జిల్లా జాయింట్ సెక్రెటరీగాఎన్నికయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధలో జర్నలిస్టుల సంఘటితపరచి అనేక పోరాటాలు నిర్వహించి రాష్ట్రాన్ని సాధించుకున్న మన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నాయకత్వంలో ప్రతి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డులు అందించి వైద్యపరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులకు నేరుగా వారి అకౌంట్ లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ద్వారా రూ.20 వేలు అందించడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో అర్హులైన జర్నలిస్టులకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.