
సరూర్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : జి హెచ్ ఎం సి ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ నుంచి పోటీ చేసిన అ నితా దయాకర్ రెడ్డి ఓటమిపాలైన ప్పటికీ తాము నిత్యం ప్రజల్లోనే ఉంటానని సరూర్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు. గెలిచిన ఓడిన ప్రజల్లోనే ఉంటూ ప్రజా సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. సరూర్ నగర్ డివిజన్ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసా వహిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమికి కారణాలేమిటో విశ్లేషించుకొని రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రేటర్ లో టిఆర్ఎస్ మేయర్, స్థానిక ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇ సహకారంతో డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆకుల అరవింద్ కుమార్ అన్నారు. గెలిచిన బిజెపి అభ్యర్థి కూడా రాజకీయాలకతీతంగా డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.