
నిధులు వీధుల గురించి మాకు తెలుసు మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని మనసురాబాద్ కార్పోరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సూచించారు. ఇప్పటి వరకు అభివృద్ధి పనులు అన్నీ తానే చేయాలని అనుకునేవారు అని ఇక ఆ వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు.. బిజెపి తరఫున గెలిచిన కార్పొరేటర్లు అందరికీ తమ విధులు జిహెచ్ఎంసి నిధుల గురించి అవగాహన ఉందని అన్నారు.. జిహెచ్ఎంసి కి తాము పన్నులు చెల్లించి చెల్లిస్తున్నా మని, ఆ పనుల్లో 80 శాతం నిధులు తమ కాలనీలో అభివృద్ధి కోసం బస్తీల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అలా చేయకపోతే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. తాము కార్పొరేటర్ల మందారము సమిష్టిగా పోరాటం చేసి నిధులు సాధించుకుంటామని నరసింహారెడ్డి తెలిపారు.