
ఉద్యోగం కల్పించరు కానీ ఉపాధి ని దూరం చేస్తారా?
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు అమ్మ పెట్టదు అడుక్కొని వద్దు అన్నట్లుగా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కెసిఆర్ సర్కారు తీసుకువచ్చిన టీఎస్ ఎస్ బి పాస్ పథకం వల్ల వేలాది మంది ఇంజనీర్లు ఉపాధి అవకాశాన్ని కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోని 9 వేల మంది ఇంజనీర్లకు లైసెన్స్ లను టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా మంజూరు చేయడం జరిగింది. టి ఎస్ బి పాస్ పథకాన్ని తీసుకు రావడం ద్వారా వీరందరికీ ఉపాధి అవకాశాలు మృగం గా కనిపిస్తున్నాయి. ఇంజనీర్ల ప్రమేయం లేకుండానే నేరుగా టి ఎస్ బి పాస్ పథకం ద్వారా భవన నిర్మాణ దారులు ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే కల్పించారు. దీనితో ఇంజనీర్లకు పని అంటూ లేకుండా పోయింది. ఒక్క ఇంజనీర్ల కే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న ఆఫీస్ సిబ్బంది కూడా టి ఎస్ బి పాస్ పథకం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించని రాష్ట్ర ప్రభుత్వం తాము సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందుతున్న చూసి అన్నట్లుగా టీఎస్ బి పాస్ పథకాన్ని తీసుకు వచ్చింద నీ పలువురు ఇంజనీర్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా టి ఎస్ బి పాస్ పథకంలో ఈ మార్పులను తీసుకు వచ్చి ఇంజనీర్ల ప్రమేయం ద్వారానే బిల్డింగ్ నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని కోరుతున్నారు . లేనిపక్షంలో వేలాది కుటుంబాల తో కలిసి తాము రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Continueing DPMS system correct.
Continue DPMS or
Show employment to ALL LTP’s
TS Govt. Generating unemployment problem through tsbpass.
ok