
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : అభ్యర్థుల ఎంపిక … ప్రచారం లో రంగారెడ్డి ది కీలక పాత్ర ఎల్ బీ నగర్ నియోజకవర్గం పరిధి లోని 11 కు 11 డివిజన్ స్థానాలను బీజేపీ గెల్చుకుంది. ఈ గెలుపు లో బీజేపీ రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ది కీలక పాత్ర అనే చెప్పాలి..రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. జీహెచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు పార్టీలోకి తీసుకోవడం, పార్టీ కి చెందిన బలమైన నాయకులకు తికెట్లు ఇప్పించుకోడం లో సక్సెస్ అయ్యారు.అదే సమయం లో పార్టీకి సానుకూల వాతావరణం నెలకొనడం బీజేపీ , జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ కి చెందిన అభ్యర్థులు 11 డివిజన్లలో విజయం సాధించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు. 2023 లో రాష్ర్టంలో లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమని అన్నారు.. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇకనైనా మారాలని, అభివృద్ధి విషయం లో రాజకీయాలకు తావు ఇవ్వొద్దని సూచించారు.