
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ పథకం ఎంత ఆ పార్టీకి కి నష్టాన్ని చేకూర్చిం దో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు టీఆరెఎస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పారు..ఎల్ బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో పరిధి లో ప్రజలు టీఆరెఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టారు . గ్రేటర్ వ్యాప్తంగా బీజేపీ అనూహ్యంగా 48 స్థానాల్లో విజయం సాధించి , రెండవ అతి పెద్ద పార్టీ గా ఆవిర్భవించింది..ఎల్ బి నగర్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ అభ్యర్థుల విజయం పరిశీలిస్తే ఎల్ అర్ ఎస్ పథకం పై ప్రజల్లో ఎంతటి వ్యతిరేక ఉన్నదో తేటతెల్లమవుతుంది. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు అలా బీజేపీలో చేరి టికెట్ సంపాదించుకున్న వారు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.