
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి మీడియానే కారణమని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీడియాపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
మీడియానే ప్యాకేజీల కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కావాలనే టీఆర్ఎస్ బీజేపీల మధ్య పోటీ అంటూ మీడియా ప్రచారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మీడియా చాలా విచిత్రంగా ప్రవర్తించింది అని సామాజిక బాధ్యతతో ప్రవర్తించాల్సిన మీడియా ఆ విధంగా ప్రవర్తించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉన్నట్టుగా చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పెద్దగా చూపించలేదని మీడియా చిత్రీకరణ వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పదేపదే అదే చూపించడంలో ఆంతర్యం అర్థం కాలేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే అవే వార్తల అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో నాలుగోస్తంభం అయిన మీడియా ఇలా ప్రజాస్వామ్య వినాశనానికి కారణం అవుతుందని అనుకోలేదని తాను చాలా ఆవేదన లో మాట్లాడు తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి.
కార్యకర్తల ప్రత్యామ్నాయం లోపం లేదు ప్రస్తుత కాలంలో జెండా మోసిన కార్యకర్తలకు అభినందనలు అందించిన రేవంత్రెడ్డి అనేక దుష్ట శక్తుల కుయుక్తులను ఎదుర్కొనే ఆర్దిక అంగబలాలను దీటుగా తట్టుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతులను గెలిపించడం కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.