
చిగురింత నర్సింహారెడ్డి 20 ఏళ్లుగా నాకు స్నేహితుడు ఆయనపై నేను ఎందుకు దాడి చేస్తాను.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటలకు ముందే ఇతర ప్రాంత నాయకులు, పోలింగ్ జరిగే ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ, మంత్రి సబితా రెడ్డి మాత్రం బడంగ్పేట్ అమీర్పేట మహేశ్వరం కందుకూరు నాయకులను పోలింగ్ బూతుల వద్ద మోహరించారని ఆయన అన్నారు. ఇతర ప్రాంత నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తూ కథను బాల గురి చేస్తూ ప్రశాంతంగా ఓపెనింగ్ జరగాల్సిన ప్రదేశాన్ని రణరంగంగా మార్చారని విమర్శించారు. సరూర్నగర్ ఆర్.కె.పురం డివిజన్ల పరిధిలో టిఆర్ఎస్ బిజెపి నాయకుల మధ్య గొడవలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా ఘర్షణలకు తావులేకుండా ప్రచారం నిర్వహించాలని గుర్తు చేశారు. ఇంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు తాను చిగురింత నరసింహా రెడ్డి పై దాడి చేసినట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఎందుకు దాడి చేస్తానని ఎదురు ప్రశ్నించారు.చిగురింత పై బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తుండగా కానీ అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేశారు అని చెప్పారు.