
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ సమూల ప్రక్షాళన పునర్వైభవం దిశగా అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది.
డిసెంబర్ 9 పిసిసిగా యనమల రేవంత్ రెడ్డి నియామకం దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.
డిసెంబర్ తొమ్మిదిన టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది. ఆ రోజు ఆ గాంధీభవన్లో భూకంపమే నా అలజడి రేగడం ఖాయమా..? ఢిల్లీ అధిష్టానం ఓ సెన్సేషనల్ డెసిషన్ కు రెడీ అయ్యిందా? డిసెంబర్ తొమ్మిదినే ముహూర్తంగా ఎందుకు ఎంచుకుంది.? ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అసలేం జరుగుతోంది.
గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ కథేంటి ఈ ప్రశ్నకు ఆ పార్టీ నాయకుల దగ్గరే ఆన్సర్ లేదు. అధిష్టానం దగ్గర సమాధానం లేదు ఏదో పోటీలో నిలబడ్డాం, అభ్యర్ధులను ప్రకటించాం, ప్రచారం చేశాం ఇంతే. మమ అనిపించారు.
ఢిల్లీ హైకమాండ్ కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. బిజెపి ఢిల్లీ ఆగ్రా నాయకత్వమంతా వరుసబెట్టి గ్రేటర్ లో ల్యాండ్ అవుతున్న బిజెపి ఢిల్లీ అగ్రనాయకుల తామంతా వరుసబెట్టి గ్రేటర్లో ల్యాండ్ అవుతున్న ఓడిపోయే దానికి ఎందుకు ప్రచారం అన్నట్లుగా, కాంగ్రెస్ నేషనల్ లీడర్లు భాగ్యనగరానికి రాలేదు.
అయితే ఎన్నికలు ముగిశాయి బల్దియాపై కాంగ్రెస్ కు హోప్స్ లేవు మరి నెక్స్ట్ ఏంటి..? కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన సమయం ఆసన్నమైంది? అందుకు ముహూర్తం ఖరారైంది.
డిసెంబర్ 9. ఈ తేదీకి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉంది. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది ఈ తేదీనే అంతేకాదు మరో ప్రత్యేకత కూడా ఉంది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజు సరిగ్గా ఇదే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం రెడీగా మారబోతోందని గాంధీభవన్లో వినిపిస్తున్న లేటెస్ట్ చర్చ. ఇంతకీ డిసెంబర్ తొమ్మిదిన టీకాంగ్రెస్ లో టీపీసీసీ అధ్యక్ష మారబోతుందనేది విస్తృత ప్రచారం తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పిసిసి దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం.