
మామూళ్ల మత్తులో అధికారులు – ఎక్సైజ్ శాఖపై విమర్శల వెల్లువ
క్రైమ్ మిర్రర్ ప్రతినితి- రంగారెడ్డి తుర్కయాంజల్ మున్సిపాలిటీ విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్టుషాపులతో పలు కాలనిలో మద్యం ఏరులై పారుతోంది. పేరుకు తుర్కయాంజల్ తిరుమల వైన్స్ వాటికి అనుబంధంగా సుమారు వందల సంఖ్యలో బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. వీటిన్నిం టినీ నిర్వాహకులు, సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని తమ వ్యాపారానికి అడ్డురాకుండా చూసుకుం టున్నట్టు తెలుస్తోంది. మద్యం వ్యాపారులు అదనపు ఆదాయం కోసం ప్రోత్సహిస్తున్న ఈ బెల్టుషాపుల పుణ్య మా అని మందుబాబులు ఇల్లూ ఒల్లూ గుల్ల చేసుకుని, పచ్చని సంసారాలు కూలిపోతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆబ్కారీ శాఖ ఈ అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
బహిరంగంగా ఎక్సైజ్ శాఖ పై ఆగ్రహం
ఎక్సైజ్ శాఖ అధికారుల పని తీరు ఏమాత్రం బాగోలేదని, మద్యం శాఖపై తమకు ఫిర్యాదులు వెల్లువెతున్నాయి. యాంజల్ లోని వైన్స్ యజమానులు విచ్చలవిడిగా మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఒకసారైనా దాడులు నిర్వహించకపోవడం దేనికి సంకేతమన్నారు. నాటుసారాను అరికట్టే క్రమంలో పలువురుపై కేసులు నమోదు చేయడం తెలిసిన మీకు, అధిక ధరలకు విక్రయిస్తున్న వైన్స్ యజమానులపై, బెల్ట్ షాప్ నిర్వాహకులపై కేసులు పెట్టడం తెలియదా అంటూ ఆరోపిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ పై స్థానికులు ఫిర్యాదులు
స్థానిక తిరులమల వైన్స్ లో మద్యం MRP విషయంలో పలు మార్లు కొనుగోలు దారులకు వైన్స్ షాప్ సిబ్బంది కి గొడవలు జరిగిన అధికారులు మాత్రం నామ మాత్రం గా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులు, వైన్స్ యజమానుల దగ్గర నెలనెలా ముడుపులు తీసుకుంటూ ధరలు నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం లేదని మద్యం ప్రియులు చర్చించు కుంటున్నారని పలువురు స్థానికులు ఆరోపించారు. పేద ప్రజల చెమట కష్టాన్ని వైన్స్ యజమానులు అధిక ధరల రూపంలో వసూలు చేస్తుంటే, కనీస తనిఖీలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ ఎక్సైజ్ అధికారుల తీరు బాలేదని, తిరుమల వైన్స్ షాపుపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుకుంటున్నారు.