
అఖిల పక్షం అంటే ఆ రెండు పార్టీలే నా?… దేప దాడి చేసినట్లు ఆధారా లేవీ? మీడియాకు ఎక్కడం వంగేటికి తగదు … డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : బడంగ్ పేట లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని టిఆర్ఎస్ నాయకులు చేసిన ప్రకటనపై డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. అఖిలపక్ష సమావేశం అంటే అన్ని రాజకీయ పక్షాల నాయకులు పాల్గొనాలని, కానీ కేవలం టిఆర్ఎస్ బిఎస్పి కాంగ్రెస్ నాయకులు మాత్రమే పాల్గొంటే అఖిలపక్ష సమావేశం అవుతుందా అని ప్రశ్నించారు. బడంగ్పేట్ నగర పంచాయతీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి పై జరిగిన తాడి లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు కనిపించలేదని అన్నారు. దేప ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని ఆయన ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకొని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారన్నారు. ఆర్.కె.పురం బిజెపి అభ్యర్థి రాధ ధీరజ్ రెడ్డి చిగురింత నరసింహారెడ్డి ని నిలదీయడం వీడియో లో స్పష్టంగా కనిపించింది అన్నారు. చిగురింత పై దాడి చేసింది బీజేపీ నాయకులు కార్యకర్తలు మాత్రమేనని ఆ దాడితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి సంబంధం లేదని నరసింహారెడ్డి తెలిపారు. బడంగ్ పేట లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కార్పోరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ వేదికలో చర్చించాలి. అంతేకానీ మీడియాకి ఎక్కడం సబబు కాదని ఆయన అన్నారు.