
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : నరసింహయ్య పై అభిమానంతోనే అలా చేశాను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య మాట్లాడినట్లుగా చెప్పబడుతున్న ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నరసింహ తనకుతానుగా మాట్లాడినట్లుగా చెప్పబడుతున్న ఈ ఆడియో టేప్ ఫేక్ అని తేలింది. తనకు కమ్యూనిస్టు గానే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నరసింహయ్య కోరినట్లుగా చెప్పబడుతున్న ఆడియో ప్రజా నాట్య మండలి కళాకారుడు శ్రీనివాస్ మిమిక్రీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నరసింహయ్య పై అభిమానం తోనే తాను అలా చేశానని ఈ ఆడియోను కొంతమంది ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహయ్య బతికి ఉంటే ఎలా మాట్లాడేవాడు చెప్పడానికి తన తోటి మిత్రులకు ఈ ఆడియో చేసినట్టుగా వివరించాడు అయితే ఇది కొందరు దుర్మార్గంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసింహయ్య కుటుంబానికి ఆయన క్షమాపణలు చెబుతూ, తనను క్షమించాలని కోరాడు.
అది నోముల గొంతు …కాదు నా గొంతు… నరసింహయ్య పై అభిమానంతోనే అలా చేశాను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య మాట్లాడినట్లుగా చెప్పబడుతున్న ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నరసింహ తనకుతానుగా మాట్లాడినట్లుగా చెప్పబడుతున్న ఈ ఆడియో టేప్ ఫేక్ అని తేలింది. తనకు కమ్యూనిస్టు గానే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నరసింహయ్య కోరినట్లుగా చెప్పబడుతున్న ఆడియో ప్రజా నాట్య మండలి కళాకారుడు శ్రీనివాస్ మిమిక్రీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నరసింహయ్య పై అభిమానం తోనే తాను అలా చేశానని ఈ ఆడియోను కొంతమంది ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహయ్య బతికి ఉంటే ఎలా మాట్లాడేవాడు చెప్పడానికి తన తోటి మిత్రులకు ఈ ఆడియో చేసినట్టుగా వివరించాడు అయితే ఇది కొందరు దుర్మార్గంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసింహయ్య కుటుంబానికి ఆయన క్షమాపణలు చెబుతూ, తనను క్షమించాలని కోరాడు.
నోముల నర్సింహయ్య మాట్లాడినట్టుగా చెప్పబడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ఆయన కుమారుడు భారత్ స్పందిస్తూ ఇది తన తండ్రి వాయిస్ కాదని కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆడియోను సృష్టించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోనే నోముల నర్సింహయ్య ప్రజల కోసం పని చేశారని తమ తమ కుటుంబం టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతుందని ఆయన చెప్పారు.