
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మహేశ్వరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవ భాస్కర్ రెడ్డి ఆర్.కె.పురం డివిజన్ పరిధిలో బడంగ్ పేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకుడు చిగురింత నరసింహారెడ్డి పై తాను దాడి చేశానని చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని మహేశ్వరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవ భాస్కర్ రెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్తలకు చిగురింత నరసింహారెడ్డి కి వాగ్వివాదం జరుగుతుండగా, తాను జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేశానని చెప్పారు. అక్కడనుండి చిగురింత నరసింహారెడ్డిని పంపించింది గొడవ కాకుండా చూశానని తెలిపారు. నరసింహా రెడ్డి పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలు అయితే తనపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని భాస్కర్ రెడ్డి అన్నారు. కొంతమంది తనను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చిగురింత నరసింహారెడ్డి ఎవరో నాకు తెలిసిన ప్పుడు తాను ఆయనపై ఎందుకు దాడి చేస్తాం అని ఎదురు ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర ప్రాంతాల వారు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతానికి రాకూడదని విచక్షణను టిఆర్ఎస్ నాయకులు మరిచిపోయారని, ఏదో రకంగా ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచే ప్రయత్నం చేశారు. అంటూ భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.