
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : కరోనా మహమ్మారి అసెంబ్లీకి కూడా పాకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కి కరవును పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయన గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండటంతో ఇప్పుడు అదే విషయం అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది. కారుమంచి తో గత రెండు రోజులుగా మాట్లాడినా మిగతా ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని భయాందోళనను పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 649 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వంద నలభై తొమ్మిది కి కరోనా కేసుల సంఖ్య చేరుకుంది.