
అయిదారు డివిజన్లలో గెలిచే ఛాన్స్
ప్రజల్లో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు ఆరు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎల్ ఆర్ ఎస్ పథకం రిజిస్ట్రేషన్ల నిలిపివేత వరద సహాయం లో వైఫల్యం ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ లో నిలిపివేత వల్ల సామాన్యుల తో పాటు అన్ని వర్గాల వారు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. తమ ప్లాట్లను తాము విక్రయించు కొని పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం కల్పించిందని పలువురు ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం కనిపించింది. ఇంకా ఎల్ఆర్ఎస్ పథకం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా తాము ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లకు లక్షల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం కార్పొరేటర్లు అధికారులు కలిసి స్వాహా చేసిన వైనం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహానికి కారణంగా కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక అంశాలన్నీ బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నిరుద్యోగ యువత అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ సర్కారు మెడలు వంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా వారి పక్షాన అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి, నాగోల్, మనసురాబాద్, వనస్థలిపురం, హయత్నగర్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నువ్వానేనా అన్నట్లు కొనసాగే అవకాశాలున్నాయి. కొత్తపేట లోనూ బీజేపీ అభ్యర్థి గెలుపు రేసులో ముందున్న ట్లుగా స్థానికులు చెబుతున్నారు. అధికార అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు.