
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : జగన్ సీఎం అయ్యాక విగ్రహాల ధ్వంసం, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగి పోయాయని బీజేపీ సీనియర్ నాయకుడు కాపీలేశ్వరయ్య పేర్కొన్నారు. ఓంకారక్షేత్రంలో పూజారులపై దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు.సీఎం జగన్ నిరంకుశ పాలన చేస్తున్నారని, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి చెప్పారు. బనవాసిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.