
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 7వ తేదీన ఆమె బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాములమ్మ గత కొన్ని రోజులుగా బిజెపి వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆమె ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఆమె బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయ నాయకులతో జరిగిన సంప్రదింపులు సఫలీకృతం కావడంతో ఈనెల 7వ తేదీన ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. అని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ముందే పలువురు నాయకులు కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. రాములమ్మ కూడా బిజెపి లో చేరితే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశా నిస్పృహలకు లోను అయ్యే అవకాశాలు ఉన్నాయి.