
అధిష్టానం నుంచి ఆ దిశగా సంకేతాలు.
గ్రేటర్ లో తెరాస గెలిచే తొలి స్థానం సరూర్ నగర్.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: సరూర్ నగర్ తెరాస అభ్యర్థి పారుపల్లి అనితా దయాకర్ రెడ్డి విజయం సాధిస్తే ఆమెను మేయర్ పీఠం వరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు పార్టీ నాయకత్వం నుంచి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధి లో తెరాస గెలిచే స్థానాల్లో సరూర్ నగర్ తొలి స్థానమని ఆ పార్టీ ఇంటర్నల్ సర్వేలో వెల్లడ యినట్లు తెలుస్తోంది. దానితో సామాజిక సమీకరణాలు, అభ్యర్ధి ఆర్థిక స్థితిగతులు పరిశీలించిన పార్టీ నాయకత్వం అనితా దయాకర్ రెడ్డి పేరును మేయర్ అభ్యర్థి త్వానికి సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. … మేయర్ అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించండి … తెరాస డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ సరూర్ నగర్ తెరాస అభ్యర్థి అనితా దయాకర్ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని సరూర్ నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ కోరారు. సరూర్ నగర్ డివిజన్ సర్వతో ముఖభివృద్ధి కోసం అనితా దయాకర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. ఆనితను గెలిస్తే మేయర్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న దానిపై అరవింద్ స్పందిస్తూ మేయర్ పదవి సరూర్ నగర్ అభ్యర్థి దక్కితే డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. వందల కోట్ల రూపాయల తో డివిజన్ ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, అందుకే విజ్ఞులైన డివిజన్ ప్రజలు అనితా దయాకర్ ను భారీ మెజార్టీ గెలిపించాలని ఆకుల అరవింద్ కుమార్ కోరారు.