
ఈ డ్రామాలు ఇంకెన్నాళ్ళు తిరుమలేశా..
కార్మికుడి నంటు పోజులు.
చేసేది భూకబ్జాలు… వేసేది డ్రామాలు
చెప్పేవి నీతులు… చేసేది అక్రమాలు
గత ఐదేళ్లలో తిరుమలేశుని అవినీతి, అక్రమాలకు అంతే లేదు.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : హయత్ నగర్ కార్పొరేటర్, ప్రస్తుత తెరాస అభ్యర్ధి సామ తిరు మల్ రెడ్డి మళ్ళీ కొత్త డ్రామాకు తెర లేపారు. ఇప్పటికే ఎన్నో నాటకాలు వేసిన ఆయన , తాజాగా తన ప్లాట్ సామ సోదరులు కబ్జా చేశారన్న కుటుంబం తో సహా రోడ్డెక్కి ధర్నా చేసిన బాధితుని తన అధికార బలం తో బెదిరించి ఇదంతా ప్రతిపక్షాల కుట్రే నని మీడియా ముందు చెప్పించడం ఒక్క తిరుమలేశునికి మాత్రమే సాధ్యం . తన ప్లాట్ సామ సోదరులు కబ్జా చేశారన్న బాధి తుడు కుటుంబ సభ్యులతో సహా అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగిన రెండు రోజుల వ్యవధిలోనే ఎన్ని వత్తిళ్లు చేసి ఉంటే మాట మార్చ డో , బుర్ర, బుద్ది ఉన్న వారికి ఇట్టే అర్థమవుతుంది. ఎన్నికల్లో డ్యామేజ్ కంట్రోల్ కోసం బాది తుని పై వత్తిడి చేసి మీడియా ముందుకు తీసుకువచ్చి మాట మార్చే లా చేశారు. అతడు మార్చి నందుకు న్యాయం జరిగితే అందరూ హర్షిస్తారు. అయితే ఒక బాధితుడు ఎన్నికల ముందు రోడ్డెక్కి ఆందోళన చేస్తే ఆఘమేఘాల మీద స్పందించిన అధికార పార్టీ నాయకత్వం, సామ సోదరుల చేటిలిమోసపోయిన ఎంతో మందికి ఎలా న్యాయం చేస్తారో చెబితే బాగుంటుంది. భూకబ్జా దారులకు , అవినీతి పరు లకు టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న వారు చేసే అక్రమాలను పరోక్ష మద్దతిచ్చినట్లు అవుతుంది.