
అన్ని తామై ప్రచార నిర్వహణ
గెలుపు కోసం ప్రత్యేక వ్యూహ రచన
ఆకుల, బేర రాజకీయ అనుభవం ముందు ప్రత్యర్థులు బలాదూర్
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : సరూర్ తెరాస అభ్యర్థి పారుపల్లి అనితా దయాకర్ రెడ్డి ప్రచార పర్వం లో , ఎన్నికల వ్యూహరచన లో సరూర్ నగర్ బ్రదర్స్ గా పిలువబడే ఆకుల అరవింద్ కుమార్ , బేర బాలకిషన్ లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనితా దయాకర్ రెడ్డి రెండవసారి కార్పొరేటర్ అభ్యర్థి గా ప్రకటించే లా ఏకాభిప్రాయం సాధించడం లో డివిజన్ అధ్యక్షుడి గా అరవింద్ కుమార్, మహేశ్వరం తెరాస ప్రధాన కార్యదర్శిగా బేర బాలకిషన్ అందర్నీ మెప్పించడం లో సక్సెస్ అయ్యారు..మిగతా డివిజన్లలో నాయకులు కార్పొరేటర్ టికెట్ ఆశించారు..అయితే సరూర్ నగర్ లో మాత్రం అధిష్టానానికి పార్టీ పరంగా ఒక్కరి పేరును మాత్రం సూచించడం వెనుక సరూర్ నగర్ సోదరుల పాత్ర కీలకమని చెప్పాలి. ఇక అభ్యర్థి ఖరారు, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్ధి తామే అన్న రీతిలో ఇంటికి ప్రచారం నిర్వహిస్తూ, అనితా దయాకర్ రెడ్డి గెలుపు కోసం తమ రాజకీయ అనుభవాన్ని అంత ఉపయోగించి సరూర్ నగర్ సోదరులు వ్యూహరచన చేస్తున్నారు.ఈ బ్రదర్స్ రాజకీయంగా వేస్తున్న ఎత్తుగడలతో ప్రస్తుతం సరూర్ నగర్ డివిజన్ లో వార్ వన్ సైడ్ అన్నట్లు గా మారింది.