
డబ్బులు పంచుతూ అడ్డంగా మీడియా కు దొరికిపోయి బుకాయిస్తారా..?
ప్రశ్నిస్తే చంపేస్తామంటారా..?
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఇవే నా అంబేద్కర్ చెప్పిన ప్రజాస్వామిక విలువలు దళిత బహుజనులు అంటే మీకు అంత చులకనా.? గడిఅన్నారం డివిజన్లోని సీసాలబస్తీలో తెరాస అభ్యర్థి భవానీ ప్రవీణ్ డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని క్రైమ్ మిర్రర్ వెబ్సైట్లో కథనాన్ని ప్రచురించినందుకు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఫోన్చేసి నీచమైన లాంగ్వేజ్లో అడ్డంగా బూతులు తిడుతూ తమ అభ్యర్థికి వ్యక్తిగత డ్యామేజ్ చేస్తేతే చూస్తూ సహించేది లేదని హెచ్చరికలు చేయడం ఏ ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనమే అధికార పార్టీ నాయకులే చెప్పాలి . అధికార పార్టీ నాయకులు ఆగడాలను ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తారా ? , ఇకనైనా ఈ తీరు మార్చుకోకపోతే ప్రజలు హర్షించారన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి . బెదిరింపుల ద్వారా తెలంగాణ సమాజాన్ని దళిత , బహుజనులను గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు . గడ్డిఅన్నారం అభ్యర్థి బలహీన వర్గం కాదా? అన్న ప్రశ్నను లేవనెత్తే వ్యక్తులు లేకపోలేదు . అయితే తమకు సామాజిక సృహ ఎంత ఉందో అంతే ప్రజాస్వామిక స్ఫూర్తి దాగి ఉంది. ధర్మరాజులాగా తమ్ముడు తనవాడైన ధర్మం తప్పవద్దని మా నీతి. ఆయనే బిసినే కానీ అయన విధానాలు అగ్రవర్ణాల రీతి లో ఉన్నాయి . అందుకే మేము ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం సగటు వ్యక్తిని వ్యతిరేకిస్తున్నాం….
super news
thank you