
ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్ అమోయ్ కుమార్
గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి ఆనంద్ నేత : గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే అభియోగంతో విచారణ చేపట్టిన అధికారులు పోచారం సర్పంచ్ అరుణను సస్పెండ్ చేసారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశానుసారం డిపిఓ శ్రీనివాస్ రెడ్డి ఆమెకు ఉత్తర్వులు జారీచేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోచారు గ్రామపంచాయతీకి సంబందించి గత జూలై నెలలో రూ. 96,770 వేల నిధులు దుర్వినియోగానికి గురైనట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో డి.ఎల్.పి.ఓ సంధ్యారాణి నేతృత్వంలో విచారన చేపట్టిన అధికారులు సర్పంచ్ అరుణకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా గ్రామపంచాయతీ నిధులు రూ. 96,770 వేల రూపాయలు దుర్వినియోగానికి గురైనట్లు గుర్తించి సర్పంచ్ అరుణపై సస్పెన్షన్ వేటు విధించారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 37(5) ప్రకారం సర్పంచ్ అరుణను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డిపివో ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఉపసర్పంచ్ భగీరథ్ సాగర్‌ను సైతం భాద్యుడిని చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.