
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : గడ్డిఅన్నారంలో టీఆర్ఎస్ అభ్యర్థి భవానీ ప్రవీణ్ సిసాలబస్తీలో డబ్బులు పంచుతూ అడ్డంగా బిజెపి కార్యకర్తలకు దొరికిపోయారు. అధికార తెరాస పార్టీ కేవలం డబ్బులను నమ్ముకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోందని ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో గత ఐదేళ్లు తన పదవి కలంలో భవానీ ప్రవీణ్ అక్రమ వసూళ్లు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆయన ఎన్ని డబ్బులిచ్చినా తాము తాము ఓట్లు వేసేది లేదని గడ్డియన్నారం డివిజన్ సీసాల బస్తీ ప్రజలు తేల్చి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక భవానీ ప్రవీణ్ ఓటుకు ఐదు నుంచి పది వేలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాదును అభివృద్ధి చేస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెబుతున్న మాటలన్నీ భవానీ ప్రవీణ్ చేస్తున్న చేష్టల ద్వారా వీరు ఏరకమైన అభివృద్ధిని చేస్తారో ఇట్టే స్పష్టమవుతుంది. అవినీతి అక్రమాల ద్వారా కూడబెట్టిన కోట్ల రూపాయలను ప్రజలకు పంచి మరొక ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని కాపాడుకునేందుకు భవానీ ప్రవీణ్ చేస్తున్న అక్రమాలను పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని మేధావులు గడ్డిఅన్నారం ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.