
ఇప్పటి వరకు ప్రచారంలో వెనుకబడిన సాగర్
అన్ని తానై చక్రం తిప్పుతున్న ప్రకాష్ గౌడ్
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : కొత్తపేట డివిజన్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి .నిన్నటి వరకు ప్రచారం లో వెనుకబడిన లో తెరాస అభ్యర్థి సాగర్ రెడ్డి , ఒక్క సారి వేగం పెంచారు. దానికి కారణం మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ కారణమని తెలుస్తోంది. వజీర్ రంగ ప్రవేశం చేసి అసంతృప్తి తో ఉన్న నాయకుల్ని పిలిపించుకుని మాట్లాడి వార్ని ప్రచారం లో పాల్గొనే చేస్తున్నారు. కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.కాలనీ సంఘాల మద్దతు కూడ గట్టడం లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతం లో కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ గా పని చేసిన సమయం లో ఎంతో అభివృద్ధి చేసిన వజీర్ ప్రకాష్ గౌడ్ కు డివిజన్ లోని అన్ని కాలనీ సంఘాలతో సత్ సంబంధాలు ఉన్నాయి. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నేరుగా వజీర్ కు ఫోన్ చేసి, సాగర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని , పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతం వజీర్ తానే అభ్యర్థి అన్నట్లుగా ఒకవైపు ప్రచారం లో పాల్గొంటూ, మరొకవైపు పార్టీ క్యాడర్ ను ప్రచారం లో పాల్గొనేలా చేస్తున్నారు. ఇక తనకున్న సంబంధాలను ఉపయోగించి, కాలనీల్లో ఓట్లు చీల కుండా జాగ్రత్త పడుతున్నారు. కొత్తపేట నే కాకుండా , నాగోల్ డివిజన్ లోని తెరాస అభ్యర్ధి సంగీత ప్రశాంత్ గౌడ్ గెలుపు కు కృషి చేస్తున్నారు. నాగోల్ డివిజన్ లోని కాలనీలు, బస్తీలు కూడా గతం లో వజీర్ కార్పొరేటర్ గా వ్యవహరించిన సమయం లో కొత్తపేట డివిజన్ లోనే ఉండడం, ఆయనకు స్థానిక ప్రజలతోను సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల రెండు డివిజన్లలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.