
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : అచ్చంపేట. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 130వ వర్ధంతిని సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మై బిల్లీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ మల్లేష్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే పుట్టినప్పటినుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ కులమతాలు లేని సమాజం కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప మహానుభావుడు అన్నారు. కులవివక్షను అంతం చేయాలని అంతరాలు లేని సమాజం కావాలని చదువు లేని దళిత గిరిజన బహుజనులకు అక్షర జ్ఞానం నేర్పిన అటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్నారు నేటి సమాజంలో కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నాయకులు సొంత ఆస్తులు కాపాడుకోవడానికి అధికారం కోసం ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు. కానీ మహాత్మ జ్యోతిరావు పూలే ఏనాడు కూడా పదవుల కోసం ఆశపడ్డ అటువంటి వ్యక్తి కాదు బ్రతికున్నంత కాలం కులవివక్ష అంతం కావాలని పోరాడిన టువంటి గొప్ప మహానుభావుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నందగోపాల్ కిషన్ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ దేశ నాయక్ బాల్రాం తదితరులు పాల్గొన్నారు.