
డివిజన్ నేతల మధ్య సమన్వయం నిల్
తెరాస అభ్యర్థి ఓటమి ఖాయం
కావాలంటే నాల్గవ తేదీన చర్చకు రెడీ
నష్ట నివారణ లో ఎమ్మెల్యే వైఫల్యం స్పష్టం
వరద సాయం బోక్కిన వ్యక్తికి ఎందుకు ఓట్లు వేస్తాం
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : గడ్డిఅన్నారం తెరాస ఎన్నికల ఇంచార్జీ గా వ్యవహరిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్టి లింగయ్య డివిజన్ నేతలు సమన్వయము చేయడం లో పూర్తిగా విఫలం అయ్యారు. స్థానిక క్యాడర్ అభ్యర్థి వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్నారు. సీనియర్ నేతలు మొక్కుబడిగా ప్రచారం లో పాల్గొంటున్నారు.తెరాస అభ్యర్థి ప్రవీణ్ కుమార్ పై అవినీతి, ఆరోపణలు, అక్రమ నిర్మాణాలు వద్ద వసూళ్లు, వరద సాయం స్వాహా చేసిన వ్యక్తి తరుపున తాము ప్రచారం చేయలేమని దూరంగా ఉంటున్నా రు. వార్ని కలుపుకుని వెళ్లి ప్రచారం లో భాగస్వామ్యులను చేయడం లో ఎమ్మెల్యే వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక అభ్యర్థి అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్త కథనాలు వెలువడుతున్నాయి. దీనితో అభ్యర్థి పై ఓటమి ముందే ఖరారు అయినట్లు అయింది. తెరాస అభ్యర్థి ఓడిపోవడం , కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేష్ యాదవ్ గెలుపు ఖాయం అని స్థానికులు అంటున్నారు. ప్రవీణ్ ను తాము ఎందుకు ఒడించామో చెప్పాడని డిసెంబర్ నాల్గవ తేదీ చర్చకు రెడీ అంటున్నారు. పార్టీ అభ్యర్థి మద్దతుగా ఎన్నికల ఇంచార్జీ గా వచ్చిన లింగయ్య నేతలను సమన్వయము చేయడం తో పాటు, పార్టీ అభ్యర్ధి కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం అరికట్టడం లో ఘోరంగా విఫలమైనట్లు స్పష్టం అవుతోంది. ఇదే విషయాన్ని తెరాస పార్టీ నాయకత్వం గ్రహించి ఇప్పటికైనా లోపాలు సరి చేసుకోవాలని, లేకపోతే గ్రేటర్ లో తెరాస కోల్పోయే మొదటి స్థానం గడ్డిఅన్నారం అవుతుందని అంటున్నారు.