
ఆర్కే పురం లో పుంజుకుంటున్న కాంగ్రెస్
టీఆరెఎస్ విజయావకాశాలు పై తీవ్ర ప్రభావం
మంత్రి సబిత మ్మ ధీటుగా దేప వ్యూహ రచన
రోజుకింత మెరుగై గెలుపు రేసులోకి కాంగ్రెస్ అభ్యర్థి
అన్ని తామై అభ్యర్థి కంటే ఎక్కువగా దేప దంపతులు ప్రచారం
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఆర్కే పురం రాజకీయ పరిణామాలు రోజు, రోజుకి మారుతున్నాయి . తొలుత వెనుకబడిన కాంగ్రెస్ దేప భాస్కర్ రెడ్డి దంపతుల కృషి తో అనూహ్యంగా పుంజుకుని గెలుపు రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువగా దేప దంపతులు పార్టీ తరుపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో కార్పొరేటర్ గా చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కాలనీ లు, బస్తీల అభివృద్ధి బాధ్యత తీసుకుంటామని వివరిస్తున్నారు. మరొక వైపు టీఆరెఎస్ అభ్యర్థి తరుపున మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్న, ఆ పార్టీ ప్రచారం లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నప్పటికీ, లోకల్ క్యాడర్ లో జోష్ కనిపించడం లేదు. దీనితో బడంగ్ పేట్, మీర్ పేట్. మున్సిపల్ నేతలను దిగుమతి చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్కే పురం డివిజన్ ను మంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో స్థానికంగా రాజకీయ పోరు ఆసక్తికరంగా మారింది. అభ్యర్థిని చూసి, తొలుత పోటీలో లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ దేప దంపతుల కృషి వల్ల అనూహ్యంగా రేసులోకి దూసుకువచ్చి మంత్రిని కలవర పెడుతోంది. ఒకవేళ ఫలితం ఆశించినట్లు రాకపోతే, ఆమె ప్రతిష్ట దెబ్బ తినడం ఖాయం. గెలుపు రేసులోకి కాంగ్రెస్ రావడం వల్ల , టీఆరెఎస్ విజయావకాశాలు పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు..ఇక బీజేపీ కూడా గెలుపు కోసం సర్వ శక్తులను ఒడ్డుతోందీ.