
ఉమాంగ్ యాప్ మూడు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్, లా, జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విభాగాలకు సంబంధించిన ఉమాంగ్ అవార్డులను ప్రకటించారు. సేవలకు సంబంధించి గత ఆరు నెలల లావాదేవీల ఆధారంగా దీనిని ప్రకటించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) కు ప్లాటినం పార్టనర్ అవార్డు ప్రకటించారు. ఈ సంస్థ ఉమాంగ్ యాప్‌పై 25 లక్షల లావాదేవీలను పూర్తి చేసింది. ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాలైన స్మార్ట్‌ఫోన్లు, కెయోస్ ఫీచర్ ఫోన్ల వంటి వాటిని, టాబ్లెట్‌లు, డెస్క్‌టాప్‌ల పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఇపిఎఫ్ఒ ఉమాంగ్ యాప్ ద్వారా సులభమైన, నిరంతరం తన సేవలు అందుబాటులో ఉండేట్టు చేసింది. ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించి, ఇపిఎఫ్ఒ సభ్యులు ఇపిఎప్ఒ కు చెందిన 19 వివిధ రకాల సేవలను తమ మొబైల్‌పై పొందవచ్చు. సభ్యులు పాస్‌బుక్‌ను చూసుకోవచ్చు, యుఎఎన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. క్లెయిమ్‌లు చేసుకోవచ్చు, క్లెయిమ్ స్టేటస్ చూసుకోవచ్చు. స్కీమ్ సర్టిఫికేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 2020 వరకు మొత్తం 7.91 లక్షల క్లెయిమ్‌లను సభ్యులు ఉమాంగ్ యాప్‌లో దాఖలు చేశారు. ఉమాంగ్ యాప్‌పై ఇపిఎఫ్ఒ సేవలు చాలా పాపులర్. ఇందులో అక్టోబర్ 2019నుంచి 2020 సెప్టెంబర్ వరకు 42.63 కోట్ల మంది దానిని చూశారు. ఇందులో 37.93 కోట్ల హిట్‌లు ఇపిఎఫ్ఒ సేవలకు సంబంధించినవి. 88 శాతం మంది ఉమాంగ్ సేవలు చూశారు. ఉమాంగ్ పాపులారిటీకి ఇపిఎఫ్ఒ సేవలు ఒక కారణమయ్యాయి.