
గుట్టలా పెరిగిన ఆస్తులు.
ఐదేళ్ల ఆయన చేసిన వ్యాపారాలు ఏమిటి ?
ప్రజా సేవ లో అంతటి లాభా లుంటా యా ?
ఐదేళ్ల పదవి కాలం లో నాలుగు బిల్డింగ్ కట్టొచ్చా..?
క్రైమ్ మిర్రర్ ప్రతినిథి : అక్రమ వసూళ్ల బాద్ షా పై సొంత పార్టీ లోనే అసంతృప్తి. ఎల్ బీ నగర్ ముఖ ద్వార మైన ఆ డివిజన్ కార్పొరేటర్ తన ఐదేళ్ల పదవి కాలం లో ఆస్తులను గుట్ట లా కూడ బెట్టాడు. ఈ ఐదేళ్ల లో ఆయన చేసిన వ్యాపారాలు ఏమిటని ఆరా తీస్తే, అవినీతి, అక్రమ వసూళ్లు తప్ప మరొక వ్యాపకం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ కి చెందిన అభ్యర్థి అని సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ముఖం చూసి ప్రజా సేవ చేస్తాడని గెలిపిస్తే , ఐదేళ్ల పదవి కాలం లో తాను నాలుగు బహుళ అంతస్తు భవనాలు కట్టు కున్నా డు. వ్యాపారులు సైతం ఆయన్ని చూసి ఈర్ష్య పడే విధంగా ఆస్తులు కూడ బెట్టడం చూసి… ఔరా ప్రజా జీవితం ఇంతటి సంపాదన ఉంటుందా? , అని ముక్కున వెలేసు కుంటు న్నారు. ఇక సొంత పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో దురహంకార .., అతి విద్యావంతుడు నని భావించే ఆ కార్పొరేటర్ ను ఒడి స్తామని శపథం చేస్తున్నారు.