
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోనే ఆర్కెపురం డివిజన్ లో గెలుపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా అమ్మకి ఇబ్బందికరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మురుకుంట్ల విజయభారతి అరవింద్ శర్మ విజయ అవకాశాలు తక్కువగా ఉండటంతో మంత్రి ఆదేశాలతో బడంగ్పెట్, మీర్ పేట్ కార్పొరేటర్లును పార్టీ నాయకులను రంగంలోకి దించారు. గత మూడు నాలుగు రోజులుగా స్థానికంగా బడంగ్ పేట, మీర్ పేట కార్పొరేటర్లు, పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నా, డివిజన్ పార్టీ అధ్యక్షుడైన అరవింద్ శర్మ కనీసం వారికి భోజనం, టీ, టిఫిన్ సదుపాయాలు కల్పంచకపోవడంతో తామే ప్రతి రోజు 10 నుంచి 15 రూ, లు ఖర్చు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ప్రచారంలో పాల్గొంటున్న నేతలు పలువురు వాపోతున్నారు. మేడం చెప్పిందని ప్రతీరోజు అయిదు నుంచి పది మందిని తీసుకువస్తున్నామని ఉదయం టిఫిన్ మొదలుకొని మధ్యాహ్నం భోజనం, రాత్రి ఖర్చులు పెట్టుకుంటున్నామన్నారు.
దీనితో తమ ఎన్నికలు కాకపోయినా ప్రతి రోజు పది నుంచి పదిహేను వేల రూ, లు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
మేడం… ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్థానికంగా మాత్రం పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని వారు చెబుతున్నారు.