
అక్రమ వసూళ్ళలో ఆయనకు ఆయనే సాటి
ఐదేళ్ల అధికార పార్టీ లో చక్రం తిప్పిన ఘనుడు
ఎన్నికల్లో బాహుబలి అవుతాడని అనుకుంటే.
కట్టప్ప లా వెన్నుపోటు పొడిచాడు
నమ్మి పదవినిచ్చిన సుధీర్ రెడ్డి కి హ్యాండ్ ఇచ్చాడు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : పార్టీలను మంచి నీళ్లు తగినంత సులువుగా మార్చగలడు . కండువా లను కాళ్ళ కు చెప్పులు మార్చినంత ఈజీగా మార్చేయగలడు . పార్టీలను మార్చడం లో ఎంతటి దిట్ట నో , ప్రజలను ఏమార్చడం లో అంతటి ఘనుడు . సెటిల్మెంట్ , అక్రమ వసూళ్ళలో ఆయనది అందె వేసిన చెయ్యి . ఎటువంటి అధికారం అన్నది లేకముందే, అధికార పార్టీ డివిజన్ అధ్యక్షుడి హోదా లో అక్రమ నిర్మాణదారుల నుంచి భారీగా మామూళ్లు వసూళ్ల చేశాడు . టీఆరెస్ , కాంగ్రెస్ , ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న ఆ నాయకుడు , జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బిఎన్ రెడ్డి డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాడు . అధికార పార్టీ లో ఐదేళ్ల పాటు కొనసాగిన ఆయన్ని ఎల్బీ నగర్ టీఆరెస్ ఇంచార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ నమ్మి అధ్యక్ష పదవి అప్పగించాడు . అసెంబ్లీ ఎన్నికల నాటికి తన కుడి భుజం మాదిరిగా తోడుగా ఉంటాడనుకుంటే , ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి జంప్ అయి తాను బాహుబలి కాదు … కట్టప్ప అనిపించుకున్నాడు . కాంగ్రెస్ పార్టీ లో చేరకముందు బిఎన్ రెడ్డి డివిజన్ టీఆరెస్ అధ్యక్షుని హోదా లో అయన సాగించిన అక్రమాలు అన్ని, ఇన్ని కాదని పలువురు ఆరోపిస్తున్నారు . సిరిపురం కాలనీ లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు వెనుకనున్న రింగ్ మాస్టర్ ఆయనేనని అంటున్నారు . ఇక డివిజన్ లో రిజిస్ట్రేషన్ల సమస్య ఉండడం తో, మున్సిపల్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా స్థానికంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి . అయితే ఆ నిర్మాణదారులు వద్దకు మున్సిపల్ అధికారులను ఆయనే పంపించి , వారిని పిలిచి ఆయనే సెటిల్మెంట్ పేరిట వసూళ్లు చేసేవాడని ఒకరిద్దరు భవన నిర్మాణదారులు ప్రయివేట్ సంభాషణల్లో చెప్పుకొచ్చారు . రామ్మోహన్ నమ్మి రాజకీయంగా ప్రోత్సహిస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారి ఆయనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి , నమ్మి పదవి ఇచ్చిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేస్తూ , జీహెచ్ ఎంసీ ఎన్నికలకు ముందు కార్పొరేట్ టికెట్ కోసం ఆయనకు హ్యాండ్ ఇచ్చాడు . అధికారం లేకముందే అక్రమ వసూళ్లు చేసినవాడు , నమ్మి రాజకీయంగా అవకాశాలు ఇచ్చిన వారిని నట్టేట ముంచిన వ్యక్తి నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఎంత మాత్రం సేవ చేస్తాడో బిఎన్ రెడ్డి ఓటర్లు ఒక్కసారి ఆలోచించుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు .