
మాటకు కట్టుబడి ఉంటాం . దేశం కోసం పని చేస్తాం
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ కుటుంబ పాలన ను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు . కేసీఆర్ కుటుంబం బంగారుమయిందని కానీ తెలంగాణ మాత్రం రోజుకింత వెనుకబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు . దుబ్బాక ఎన్నికల ఫలితాలే జి ఎచ్ ఎం సి లో పునరావృతం అవుతాయ ని రఘు నందన్ రావు అన్నారు. బుధవారం ఆర్కె పురం డివిజన్ బీజేపీ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షో కార్యక్రమం లో మాట్లాడుతూ తెరాస కి బీజేపీ భయం పట్టుకుంది అన్నారు. ముస్లిం మహిళల కోసం తలాక్ తీసుకో చ్చిన ఘనత బీజేపీ దే అన్నారు. బీజేపీ గెలిస్తే అరాచకం వస్తది అంటున్న కె టి ఆర్, బీజేపీ ది కాదు అరాచకం ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ప్రగతి భవన్ నుండి బయటికి రాని ముఖ్యమంత్రి ది అరాచకం అని అన్నారు. రెండవ సారి కార్పొరేటర్ గా రాధా రెడ్డి ని గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి, బొక్క నరసింహ రెడ్డి,మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందేల శ్రీరాములు యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ ధీరజ్ రెడ్డి, సీనియర్ నాయకుడు పిట్ట ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.