
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఆయనకు నాయకుడిగా మంచి గుర్తింపే ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆయన అతనే ఎన్నికల్లో ఆయన అతనే ఎన్నికల్లో విజయావకాశాలను దెబ్బ తీస్తుంది. గత ఎన్నికల్లో తన సతీమణి బరిలోకి దించిన ఆయన చేజేతులా ఆమె ఓటమికి కారణమయ్యారు. మళ్లీ బీజేపీ నుంచి ఆయన మరోసారి పోటీ చేసే అవకాశం లభించింది. తన ధోరణిలో ఏమాత్రం మార్పులేదు క్యాడర్ను కలుపుకోకపోవడం లేదు మళ్ళీ అదే తత్తరపాటు.
ప్రజల్లోకి వెళ్లడం లోనూ ఎందుకో తెలియదు కానీ అదే నిర్లక్ష్య వైఖరి. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా బీజేపీ హవా కనిపిస్తోంది. ఎల్బినగర్ లోనూ నాలుగైదు స్థానాల్లోనూ బీజేపీ హెడ్ కనిపిస్తుంది.
ఈ బీజేపీ నేత సతీమణి కూడా గెలిచే అవకాశాలున్నాయని అందరూ అంటున్నారు.
కానీ సదరు నాయకుని వ్యవహార శైలి వల్ల మళ్లీ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
టిడిపిలో ఉన్న సమయంలో చేసిన పొరపాటే మళ్లీ బిజెపిలోనూ చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే అంటున్నారు.
ఎన్నికలకు అతి కొద్ది సమయమే మిగిలి ఉన్న ప్రస్తుత తరుణంలో సదరు ఆ నాయకుడు క్యాడర్ను కలుపుకుపోవడం లో విఫలం అయ్యారని అంటున్నారు.
ఈసారి విఫలం అయితే ఆయన రాజకీయ జీవితంలో మాయనిమచ్చగా మిగులుతుందని సొంత పార్టీ కార్యకర్తలే అంటున్నారు.