
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : గ్రేటర్ పీఠంపై పాగా వేసే భాజపా మాత్రమేనని ఆ పార్టీ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి కుమార్ అన్నారు. లింగోజిగూడ డివిజన్ లో ప్రచారంలో తెరాస అవినీతి అక్రమాలపై ప్రజలకు వివరిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. చెరువులు నాలాలు కబ్జా చేశారని ఆరోపించారు. గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు చిన్నపాటి వర్షానికే నాలాలు పొంగిపొర్లుతున్నాని అన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం భాజపాదేనని పునరుద్ఘాటిస్తూ మాట్లాడారు. అధికార పార్టీ ఇటీవల కురిసిన వర్షాలకి పేద ప్రజలకు ఆర్థిక సాయం చెయ్యలేక బురద రాజకీయాలకీ తెరలేపారని ఆయన ఆరోపించారు .