
(క్రైమ్ మిర్రర్ ప్రత్యేక ప్రతినిధి ): దుబ్బాక ఫలితమే మన్సూరాబాద్ లో రిపీట్ కానుందా ? అంటే అవుననే అంటున్నారు మన్సూరాబాద్ డివిజన్ ప్రజలు. దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి , ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను ప్రచారానికి వెళుతుండగా నడిరోడ్డుపై నిలబెట్టి పోలీసులు గంటల తరబడి వాహనాన్ని తనిఖీ చేసిన విషయం తెలిసిందే .
రఘునందన్ రావు ను ఏ విధంగా నైతే గంటల తరబడి వాహనాన్ని తనిఖీ చేశారో అదే విధంగా మన్సూరాబాద్ బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కొప్పుల నర్సింహారెడ్డి ప్రచారానికి వెళుతుండగా ఆయన్ని సైతం పోలీసులు నడిరోడ్డుపై వాహనాన్ని నిలిపి డబ్బులు ఉన్నాయన్నా నెపంతో వాహనాన్ని తనిఖీ చేసి నర్సింహారెడ్డిని వేధింపులకు గురి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . . పోలీసుల తనిఖీలో ఆయన వాహనం లో ఒక్క రూపాయి నగదు కూడా లభించకపోవడంతో పోలీసులు చేసేది లేక వెనుతిరిగారు . మన్సూరాబాద్ డివిజన్ లో కొప్పుల నర్సింహా రెడ్డికి అన్ని వర్గాల ఆదరణ లభిస్తుండడం తో ఆయన్ని పోలీసుల ద్వారా ఎలాగైనా వేధింపులకు గురి చేయాలని అధికార పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది . అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే ప్రచారానికి వెళుతున్న నర్సింహా రెడ్డిని పోలీసులు తనిఖీల పేరిట ఆపి ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి . దుబ్బాకలో ఇదే తరహాలో బిజెపి అభ్యర్థిని పోలీసులు వేధిస్తే , ఓటర్లు తమ ఓటు ద్వారా ఎలాగైతే అధికార పార్టీకి బుద్ధి చెప్పారో … అదేవిధంగా మన్సూరాబాద్ డివిజన్ ప్రజలు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ నాయకత్వానికి బుద్ధి చెప్పనున్నారని స్థానికులు అంటున్నారు . అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ పై అవినీతి ఆరోపణలు అధికంగా వినిపిస్తుండటంతో ఆయన ఓడిపోవడం ఖాయమని భావిస్తున్న అధికార పార్టీ నాయకులు, నర్సింహారెడ్డిని ప్రచారం చేసుకోకుండా పోలీసుల ద్వారా నిలవరించి ప్ర త్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి . తనని పోలీసులు ఎంతగా వేధించినా , ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ఈ సందర్బంగా నర్సింహారెడ్డి చెప్పుకొచ్చారు . మన్సూరాబాద్ డివిజన్ లో ప్రజల అండదండలు కార్యకర్తల సహకారంతో కాషాయ జెండా ఎగురవేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు . గతంలోనూ పోలీసులను అడ్డుపెట్టుకుని తనని అధికార పార్టీ నాయకులు ఇదే విధంగా వేధించిన విషయం ప్రజలకు తెలుసునని నర్సింహారెడ్డి అన్నారు గతంలో కార్పొరేటర్ లతా నర్సింహారెడ్డి చేసిన అభివృద్ధి, నిరంతరంగా రాజకీయాల్లోనే కొనసాగుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి తాను చేసిన సేవలను డివిజన్ ప్రజలు గుర్తించి తనని ఈ ఎన్నికల్లో ఆదరిస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు .ఇక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ ఫ్యామిలీకి చరమగీతం పాడాలని ప్రజలు భావిస్తున్నారని , దానికి దుబ్బాకను వేదికగా చేసుకున్నారని చెప్పారు . . ఎల్ఆర్ఎస్ పేరిట సామాన్య ప్రజలను చట్టబద్ధంగా దోచుకునేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడను ప్రజలు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థులను ఓడించడం ద్వారా తిప్పికొట్టనున్నారని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఎల్ఆర్ఎస్ పథకం రద్దు చేయాలంటే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు .