
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఆర్కెపురం డివిజన్ లో గెలుపును విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి విజయభారతి అరవింద్ శర్మకు ఎదురుగాలి వీస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్కేపురం, సరూర్నగర్ రెండు డివిజన్లలోను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీచేసిన దేప సురేఖ భాస్కర్ రెడ్డి, ఎల్లేటి భార్గవి చంద్రశేఖర్ రెడ్డిలు విజయం సాధించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొందని అయితే సరూర్‌నగర్ స్థానిక కార్పొరేటర్ ప్రస్తుత టిఆర్ఎస్ అభ్యర్థి అనితా దయాకర్ రెడ్డి గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు.
ఆర్కే పురం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాధా ధీరజ్ రెడ్డి పై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకపోవడం, డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బలహీనవర్గానికి చెందిన పొన్నా నిర్మల గణేష్ నేత వీరిద్దరూ గట్టి పోటీనిచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ రేంజ్లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న అరవింద్ శర్మను పిలిచి ఆరా తీయగా ఆయన ప్రతిరోజూ తన వెంట తిరిగే పది మంది పేర్లు చెప్పడంతో వారు కాలనీల్లో తిరిగితే పార్టీకి పడే ఓట్లు కూడా పడవని భావించిన మంత్రి సభితమ్మ బడంగ్పేట్, మీర్పేట్ కార్పోరేటర్లను పార్టీ నాయకులను రంగంలోకి దించారు.