
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : పాతబస్తీ లో ప్రచారం చేసే దమ్ము ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేదు అని బీజేపీ రాష్ట్రఅధ్యక్షులు బండి సంజెయ్ అన్నారు. తెలంగాణ రాష్టంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలా ..? ఒక్కరే ముఖ్యమంత్రి గా ఉండాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలి అని తెలిపారు. పాతబస్తి నుంచి దేశ ద్రోహులను తరిమికొడుతాం అని పేర్కొన్నారు. హైదరాబాద్ మార్పు బీజేపీ తోనే సాధ్యం. గ్రేటర్ ను పాలించే అవకాశం ఒక్కసారి బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఇక పై భాగ్యలక్మీ దేవాలయం దగ్గరే మా అడ్డా పెడుతాం. అభివృద్ధి, రాజకీయం గా హైదరాబాద్ అభివ్రుది పై తెరాస ఇచ్చిన హామీలు లిటి మూటలయ్యాయి. డబుల్ బెదరం ఇండ్లు ఇస్తానని పెదాలను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగాలకు నోటిఫ్కేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటోంది. అన్నారు. కెసిఆర్, కేటిర్ తీరుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు కల్పిస్తున్నారు. వరద బాధితులను ముఖ్యమంత్రి మందలించాక పోవడం బాధాకరం. ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలనీ అని బండి సంజెయ్ పేర్కొన్నారు.