
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కోనేరి ఆంజనేయులు ఈ నెల 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. సీపీ సజ్జనార్ సూచన మేరకు ఆంజనేయులు అవయవాలను కుటుంబ సభ్యులు ఇతరులకు దానం చేశారు. ఇక, ఆంజనేయులు కానిస్టేబుల్ గా అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన అంతిమయాత్రలో సీపీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. పాడె మోసి తమ పోలీసు సహచరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.