Rajanna SiricillaTelangana

18 ఏళ్ల తరువాత దుబాయ్ జైలు నుంచి విముక్తి.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చేయని నేరానికి సుదీర్ఘ కాలం దుబాయ్‌ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవతో జైలు నుంచి విడుదలైన స్వదేశానికి చేరుకుంటున్నారు. రెండు నెలల క్రితం దుబాయ్ జైలు నుంచి సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదల కాగా.. రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హన్మంతు రెండ్రోజుల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఇవాళ పెద్దూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు జైలు నుంచి విడుదలై స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు.

Read Also : మార్కులు తక్కువొచ్చాయని విద్యార్ధులను చితకబాదిన ఉపాధ్యాయుడు.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను చూసిన అన్నదమ్ములు కన్నీటితో వారిని హత్తుకున్నారు. ఇక అక్కడే తమ జీవితం ముగిసిపోతుందని భావించిన అన్నదమ్ములు సొంత వారిని కళ్లారా చూడటంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. హృదయాన్ని మెలిపేట్టే ఈ సీన్‌ అక్కడున్న అందరిచే కంటతడి పెట్టించింది. గత 18 ఏళ్ల క్రితం అంటే 2005లో జిల్లాకు చెందిన మల్లేశం, రవి, హన్మంతు, లక్ష్మణ్, వెంకటేశ్ దుబాయ్ వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఆరు నెలలకే నేపాల్‌కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న ఈ ఐదుగురు హత్య కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావటంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష విధించింది.

Also Read : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో

అనంతరం అప్పీలుకు వెళ్లగా.. 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదలకు అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఓసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు. నేపాల్‌లో మృతుడు బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్ష పై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ రూ. 15 లక్షల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్‌లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది. గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ కేసు వేయించారు. కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ తీసుకొని ఈ కేసులో క్షమాభిక్ష కోరటం కోసం మంత్రి కేటీఆర్ అక్కడి అధికారులతో సమీక్షించారు. చివరకు కోర్డు క్షమాబిక్ష పెట్టటంతో నలుగురు స్వదేశానికి చేరుకున్నారు. చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశ్ వచ్చేనెలలో విడుదల కానున్నారు.

ఇవి కూడా చదవండి :

  1. మహాజాతరకు నేడే అంకురార్పణ.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
  2. ఆ ఊరికి దెయ్యం పట్టిందా?.. చచ్చిన తర్వాత కూడా పీక్కుతింటోందా?
  3. ‘సార్ మమ్మల్ని ఆదుకోండి..’ సీఎం రేవంత్‌కు 2008 డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్ధన..
  4. చావు అంచుకు వెళ్లిన వ్యక్తికి ప్రాణం పోసిన పోలీస్‌.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై
  5. ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. రంగంలోకి తెలంగాణ సీఎం???

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.