మహారాష్ట్రలో బీజేపీ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మహాయుతి ఏకపక్ష విజయం సాధించింది. వార్ వన్ సైడ్ గా సాగడంతో కమలం కూటమిఏకంగా 230 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కూటమి కేవలం 46 సీట్లకే పరిమితమైంది. ఇతరులు 13 స్థానాల్లో గెలిచారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లోనూ కమలం కూటమి హవా కనిపించింది. ముంబై మహానగరంతో పాటు మరట్వాడా,థానే-కొంకణ్, విదర్భ రీజియన్లలో కమలం కూటమి ఏకపక్ష విజయాలు సాధించింది.
పార్టీల వారీగా చూస్తే మహాయుతి కూటమికి సంబంధించి బీజేపీ సింగిల్‌గా 132 సీట్లు గెలిచింది. 144 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 90 శాతానికి పైగా స్ట్రైక్ రేటు సాధించింది. శివసేన 57 నియోజకవర్గాల్లో, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లలో గెలుపొందింది. మహఘట్ బంధన్ కూటమిలో కాంగ్రెస్ కేవలం 16 సీట్లు మాత్రమే సాధించింది. ఉద్ధవ్ థాకర్ పార్టీ 20 సీట్లు గెలవగా.. శరద్ పవార్ పార్టీ 10 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది.
మహారాష్ట్రలో సైతం AP మాదిరే సక్సెస్ కొట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీజేపీ పెద్దల ఆహ్వానంతో మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ఐదు జిల్లాల్లో బీజేపీ తరుపున రెండు రోజుల పాటు ప్రచారం ప్రచారం చేశారు. అక్కడ రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. పూణే కంటోన్మెంట్, బల్లార్‌పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసించే వారి ఓట్లే లక్ష్యంగా ప్రచారం సాగింది. పవన్ ప్రచారం చేసిన నియోజవర్గాల్లోని బీజేపీ అభ్యర్ధులు గెలిచి సక్సెస్ కొట్టారు.