రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు అవడం అలాగే బెయిల్ మీద మళ్ళీ బయటకు రావడం అనేది చక చక జరిగిపోయింది. అయితే ఈ పరిణామాలు అన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశం మొత్తం కూడా ఈ విషయం పైన చర్చించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ లాగా అన్ని మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. ప్రతిక్షణం కూడా ఉత్కంఠంగా మారుతూ వచ్చింది.
అరెస్టయినా కొద్ది గంటల్లోనే మధ్యంతర బెయిల్ రావడం వల్ల అల్లు అర్జున్ ను ఉదయాన్నే ఇంటికి పంపించేశారు పోలీసులు. సుమారు రాత్రి 7:00 సమయంలో హైకోర్టు నుంచి అల్లుఅర్జున్కు బెయిల్ ఇవ్వాలని ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయినా సరే రాత్రి కావడంతో జైల్లోనే గడపాల్సి వచ్చింది అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే బన్నీ తరుపున హైకోర్టులో ముందస్తు బెయిల్ పై వాదనలు వినిపించిన వైసీపీ నాయకుడు అలాగే ఆ పార్టీ మాజీ ఎంపీ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించారు.
ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. చివరికి అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చేలా చేశారు. దీంతో బన్నీ అభిమానులు అలాగే కుటుంబీకులు అందరూ కూడా లాయర్ పై ప్రశంసలు కురిపించారు. గా అతని రోజువారి వాదనల ఫీజు ఏకంగా ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఉంటుందట. అని బన్నీ ఫ్యామిలీ అతను ఒక్కడికే 30 లక్షలు వరకు ఇచ్చారని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇక అతని కిందనే ఈ వాగులకు మూడు నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక లాయర్ ఫలితం దక్కడంతో బన్నీ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంలో ఉన్నారు.