ఆంధ్రప్రదేశ్ లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సత్తా చాటిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. మహారాష్ట్రాలోనూ తన మార్క్ చూపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 చోట్ల పోటీ చేసి 21 స్థానాలనూ జనసేన కైవలం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో మహారాష్ట్రలో పపన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థిలే విజయం సాధించారు.
పూణే కంటోన్మెంట్, బల్లార్‌పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలు, బహిరంగసభలు నిర్వహించారు. తెలుగు ఓటర్లే లక్ష్యంగా పవన్ చేసిన ప్రసంగానికి ఊహించని స్పందన వచ్చింది. ఎన్నికల ఫలితాల్లోనూ పవన్ మేనియా కనిపించింది. జనసేనాని ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది.
లాతూర్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు బీజేపీయే పై చెయ్యి సాదించింది. లాతూరులో తొలిసారి బీజేపీ గెలిచింది. అది పవన్ వల్లే సాధ్యమైందని మహారాష్ట్ర బీజేపీ నేతలు చెప్పారు. మహారాష్ట్ర ప్రజలకు తనకు 100 శాతం స్ట్రైక్ రేట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీంతో పవన్ పవర్ మార్క్ కనిపించిందంటున్నా ఆయన అభిమానులు.