తెలంగాణ

హైదరాబాద్‌లో గజం భూమి 10 లక్షలు.. నిజమే.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందా.. భూముల ధరలు భారీగా పతనమవుతున్నాయా..? ఈ రకమైన చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ చర్చ మొదలవగా.. ఏపీలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మరింతగా ఊపందుకుంది. హైదరాబాద్ ను వదిలేసి బడా బిల్డర్లంతా అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ భూలావాదేవీ చూస్తే మాత్రం మీకు షాక్ తగలడం ఖాయం.. కొన్ని రోజులుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం కూడా ఖాయం…

గజం భూమి 10 లక్షలు.. అక్షరాలు పది లక్షల రూపాయలు.. అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ లో గజం భూమి 10 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. మహానగరంలోని ఒక ప్రాంతంలో గజం భూమి 10 లక్షల రూపాయల చొప్పున 101 గజాల స్థలాన్ని ఏకంగా 10 కోట్ రూపాయలకు సేల్ కావడం సంచలనంగా మారింది. ఈ సంచలన రికార్డు పాతబస్తీలోని బేగంబజార్ లో జరగడం మరింత సంచలనం. అన్ని రకాల హోల్ సేల్ వ్యాపారాలకు అడ్డాగా ఉన్న బేగంబజార్ ఫీల్ ఖానాలోని 101 గజాల స్థలాన్ని 10 కోట్ రూపాయలకు ఓ బడా వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ డీల్ తో తెలంగాణలోనే అత్యంత కాస్ట్లీ ఏరియాగా బేగంబజార్ గా రికార్డ్ సొంతం చేసుకుంది.

వాణిజ్య మార్కెట్ లో దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పోటీ పడే సత్తా బేగంబజార్ సొంతం. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వ్యాపారులు బేగంబజార్ లో హోల్ సేల్ బిజినెస్ చేస్తుంటారు. ఇక్కడ ఉండే వ్యాపార కుటుంబాలు తమ దందాకు దగ్గరగానే నివాసాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అత్యంత రద్దీగా, ఇరుకుగా ఉన్నా అక్కడే తమకు సొంత జాగా ఉండాలని భావిస్తుంటారు. దీంతో పరిమితంగా ఉండే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Related Articles

Back to top button