Andhra PradeshTelangana

స్పీకర్, బీజేపీ అధ్యక్ష రేసులో తెలుగు నేతలు.. “నారీ శక్తి”కి అవకాశం???

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కేంద్ర మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపు పర్వం ముగిసింది. పలువురు కేంద్రమంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇక మరికొన్ని కీలక పదవుల భర్తీ మిగిలి ఉంది. పార్లమెంటు నిర్వహణలో అత్యంత కీలకమైన స్థానం లోక్‌సభ స్పీకర్‌ది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ తొలి ఐదేళ్ల కాలం (16వ లోక్‌సభ) సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా వ్యవహరించగా, 17వ లోక్‌సభలో రాజస్థాన్ నేత ఓం బిర్లా స్పీకర్‌గా పనిచేశారు. ఈసారి ఆ స్థానం ఎవరికి కట్టబెడతారు అన్న చర్చ దేశ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. వరుసగా రెండు పర్యాయాలు ఉత్తరాదికి చెందిన నేతలకే ఆ పదవిని ఇచ్చినందున, ఈసారి దక్షిణాదికి చెందిన నేతకు ఇచ్చే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ (BJP) వర్గాల ద్వారా తెలిసింది. దక్షిణాదిలో పార్టీని విస్తరించేందుకు అష్టకష్టాలు పడుతూ అనేక వ్యూహాలను అమలు చేస్తున్న కమలనాథులు.. ఈ పదవిని దక్షిణాదిలో కీలకమైన నేతకు ఇవ్వడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చని భావిస్తున్నారు.

Read Also : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని పిల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణం!!!

ఈసారి దక్షిణ భారతదేశంలో బీజేపీ తమిళనాడు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచింది. వాటిలో కర్ణాటక నుంచి అత్యధికంగా 17 స్థానాలు గెలుచుకోగా, ఆ తర్వాతి స్థానంలో 8 సీట్లతో తెలంగాణ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3 సీట్లు గెలుచుకోగా, కేరళ ఒక సీటుతో తొలిసారి ఖాతా తెరిచింది. మొత్తంగా దక్షిణాదిన 29 సీట్లు గెలుచుకోగా, కేంద్ర మంత్రివర్గ కూర్పులో భాగంగా బీజేపీ అగ్రనేతలు అన్ని రాష్ట్రాలకు ప్రాతినిథ్యం కల్పించారు. తమిళనాడు నుంచి లోక్‌సభకు ఒక్కరు కూడా గెలవకపోయినా… డా. ఎల్. మురుగన్‌ను రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇలా మొత్తంగా దక్షిణ భారతదేశం నుంచి 10 మందికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దొరికింది. కానీ కొన్ని సామాజిక సమీకరణాల కారణంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారు. ఆమె యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత పదేళ్లుగా భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఉండి రాష్ట్రంలో కూటమి విజయంలో భాగమయ్యారు. అయినప్పటికీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడానికి కారణం సామాజిక సమీకరణాలు. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రివర్గంలో కే. రామ్మోహన్ నాయుడు (కేబినెట్ మంత్రి), డా. పెమ్మసాని చంద్రశేఖర్ (సహాయ మంత్రి) ఉన్నారు. పురందేశ్వరి – పెమ్మసాని ఒకే సామాజికవర్గం. ఒకే రాష్ట్రం నుంచి ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రుల్లో ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఉండడం సరికాదని బీజేపీ అధిష్టానం భావించినట్టు తెలిసింది.

Also Read : గులాబీ అధినేతకు బిగ్ షాక్… ఆకేసులో నోటీసులు!!!!

అందుకే పురందేశ్వరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించలేదన్న చర్చ జరుగుతోంది. అంతమాత్రాన ఆమెను ఓ సాదాసీదా ఎంపీగా మాత్రమే కూర్చోబెట్టాలని పార్టీ భావించడం లేదట. కీలకమైన లోక్‌సభ స్పీకర్ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో కమలదళం అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. పురందేశ్వరిని స్పీకర్‌ పదవికి పరిశీలించడం ద్వారా పార్టీ బహుళ ప్రయోజనాలను ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. “నారీ శక్తి” నినాదంతో మహిళా రిజర్వేషన్లను పాస్ చేసిన మోదీ సర్కార్, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవితో పాటు బీజేపీ జాతీయాధ్యక్ష బాధ్యతల్ని సైతం మహిళలకే అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో పార్టీని విస్తరించాలని బలంగా కోరుకుంటున్న కమలదళం, అందుకు కలిసొచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదల్చుకోవడం లేదు. ఈ క్రమంలో పురందేశ్వరిని స్పీకర్ పదవి కోసం అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

  1. చంద్రబాబు ….స్ట్రాంగ్ వార్నింగ్
  2. తిరుమలలో భక్తుల రద్దీ… సర్వ దర్శనానికి 18 గంటలు
  3. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే ….!
  4. సిడి ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క …
  5. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి… డీజీపీ రవి గుప్తా

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.