ఆంధ్ర ప్రదేశ్

వరదలు తగ్గాకే ఇంటికి.. కలెక్టరేట్ లోనే చంద్రబాబు బస

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ లోనే బస చేశారు. రాత్రంతా ఇక్కడే ఉండనున్నారు. కలెక్టరేట్ నుంచి వరద సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు సీఎం చంద్రబాబు. ఆయన కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని తాత్కాలిక ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేశారు.

తాత్కాలిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. వరద పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.సింగ్ నగర్ కు వెళ్లి పరిశీలించానని.. ఇంత పెద్ద ఎత్తున 1998లో నీళ్ళు వచ్చాయన్నారు. అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయ్యాయన్నారు. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో.. ఆ వరదంతా విజయవాడకు వచ్చిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

గుంటూరులో కూడా పెద్ద ఎత్తున వర్షం పడిందన్నారు చంద్రబాబు. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు.. సింగ్ నగర్ కు రావడంతో మునిగిందని చెప్పారు. సింగ్ నగర్ కు బోటులో వెళ్లి వారి కష్టాలను చూశానని తెలిపారు. హైదరాబాద్ లో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా.. వరదను చూసి వెళ్లలేదని చెప్పారు చంద్రబాబు. వరదలు పూర్తిగా తగ్గేవరకు కలెక్టరేట్ లోనే ఉంటానన్నారు చంద్రబాబు.

Related Articles

Back to top button