గత నెల రోజులుగా హల్ చల్ చేస్తున్న లేడీ నాగసాధు అఘోరీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆగమాగం చేస్తోంది. శ్రీకాళహస్తి ఆలయం దగ్గర రచ్చ చేసింది. శ్రీకాళహస్తి ఆలయం వద్ద లేడీ అఘోరికీ భద్రతా సిబ్బంది మధ్య వివాదం జరిగింది. ప్రధాన శివాలయం లోకి వెళ్లాలని ఆలయం వద్దకు చేరుకుంది లేడీ అఘోరీ. అయితే ఒంటిపై బట్టలతో రావాలని అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. కాసేపు తీవ్రంగా వాగ్వివాదం చేసిన అఘోరీ… కార్లో తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
శ్రీకాళహస్తి ఆలయంలో కి అనుమతించలేదని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం కి పాల్పడిన లేడి అఘోరి. ఆమె పై నీళ్లుపోసి బట్టలు కప్పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్తామని చెప్పి బుచ్చినాయుడు కండ్రిగ కి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె కు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు శ్రీకాళహస్తి కి దూరంగా తీసుకెళ్లారు పోలీసులు. భక్తుల కి స్థానికులకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు బుచ్చినాయుడు కండ్రిగ కు తీసుకెళ్లారు.ప్రస్తుతం వరదయ్యపాళ్యం పోలీస్ స్టేషన్ లో లేడి అఘోరి కి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. లేడి పోలీసులు అమె వెంట ఉన్నారు. శివుడికి పూజలు చేయాలని డిమాండ్ చేస్తున్న అఘోరి