తెలంగాణ

బట్టలూడదీసి కొడతం.. ఖబర్దార్ కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భగ్గుమన్నారు కాంగ్రెస్ లీడర్లు. నోరు జారితే తాట తీస్తామని హెచ్చరించారు. ఏ మొహం పెట్టుకొని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లావు  కేటీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మహిళలను కించపర్చినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించావా..? చీర, గాజులు పంపుతానని ఆడబిడ్డలను అవమానించినందుకు ఆలింగనం చేసుకున్నవా..? మదమెక్కిన ఆంబోతు లా రంకె లేస్తు కనిపించిన వారిందరి మీద ఎగబడుతున్నందుకు భుజం తట్టావా..?చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కల్లు తాగిన కోతి లా చిందు లేస్తున్నందుకు సత్కారం చేసి వచ్చావా..? ఆంధ్రా సెటిలర్లు ను అవమానించినందుకు అలాయ్ బలాయ్ ఇచ్చి వచ్చావా…? పోలీసు అధికారులను బెదిరిస్తున్నందుకు వెన్నుతట్టి అభినందించి వచ్చావా….? మహిళలను అవమానించడంలో, పోలీసులను బెదిరించడంలో మనిద్దరం ఒక్కటే అని చెప్పడానికి వెళ్లావా..? అని ఆది శ్రీనివాస్ నిలదీశారు.

అచ్చోసిన ఆంబోతు లా ఊరిమీద పడి తిరుగుతున్న కౌశిక్ రెడ్డి ని మందలించాల్సి పోయి పరామర్శిస్తావా..? అంటూ మండిపడ్డారు. సెటిలర్లను అవమానించినందుకు క్షమాపణలు చెప్పించాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. అసమర్థుడి జీవయాత్ర  లా మా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని కేటీఆర్ అంటున్నాడు..మరీ పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే కుక్కలు చింపిన విస్తరి చేసిన వాడు సమర్థుడా..? ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప గా మార్చిన వాడు సమర్థుడా…? వేల కోట్ల కమిషన్లు నొక్కేసి ప్రాజెక్టులను గాలికొదిలేసిన వాడు సమర్థుడా..? వ్యవసాయాన్ని గాలికొదిలేసి వేల మంది రైతుల ఆత్మహత్య లకు కారణం అయినోడు సమర్థుడా..? అని ఆదిశ్రీనివాస్ అన్నారు.

హైదరాబాద్ లో సెల్ఫీ పాయింట్లు తప్ప మరొటి చేయని నువ్వు సమర్థుడివా…? అధికారంలో వచ్చిన ఎనిమిది నెలల్లో 31 వేల కోట్ల రుణమాఫీ చేసిన మా రేవంత్ రెడ్డి అసమర్థుడా..? ఐదు గ్యారెంటీలను అమలు చేస్తు పేదోడి ఇంట్లో వెలుగులు నింపుతున్న మా సీఎం అసమర్థుడా..? ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వడంతో పాటు ప్రమోషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి అసమర్థుడయ్యాడా… ? అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో మమ్మల్ని జీరో చేసిన మా రేవంత్ రెడ్డి నీకు అసమర్థుడిలా కనిపిస్తున్నాడా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు.

పదేళ్లలో గుండాగిరి ఎన్నడూ లేదని సుద్దపూస కబుర్లు చెపుతున్నావు..? ప్రతిపక్ష నాయకులను ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగనిచ్చారా అని ఆది శ్రీనివాస్ సూటిగా అడిగారు. మా రేవంత్ రెడ్డి నుంచి ఎన్ని సార్లు హౌస్ అరెస్ట్ చేశారో లెక్కలు తీయమంటారా…?  డ్రోన్ ఎగురవేశారని ఒక ఎంపీని 14 రోజులు జైలు పెట్టిన రోజులు మరిచిపోయావా..?  బెడ్రూం తలుపులు బద్దలు కొట్టి మా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు నువెక్కడున్నావు..?మా రేవంత్ రెడ్డిని నడిరోడ్డు మీద ఎన్ని సార్లు రెక్కలు పట్టుకొని పోలీసులు తీసుకుపోయారో ప్రజలకు తెలియదా..? జేఎసీ ఛైర్మన్ కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి పట్టుకొని పోయినప్పుడు ఏడ ఉన్నావు..? ధర్నా చౌక్ ఎత్తి వేసిన దగుల్బాజీ లు మీరు… రైతులకు సంకెళ్లు వేసిన రాక్షసులు మీరు
మా సీఎం 18 గంటలు కష్టపడుతున్నారు.. ఫామ్ హౌస్ కు పరిమితం కాలేదు..మా సీఎం రోజూ సెక్రటేరియట్ కు వస్తున్నాడు.. ప్రతిపక్షాలు చెప్పేది వింటుండు అన్నారు. ఖబద్దార్ కేటీఆర్ .. మా సీఎంని , కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే చూస్తు ఉరుకొబోమని స్పష్టం చేశారు ఆది శ్రీనివాస్.

అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చి కేటీఆర్  ఇప్పుడు తెగ హడావిడి  చేస్తున్నాడని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. వర్షాలు,వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రజలు అల్లాడిపోతే వారి గురించి కేటీఆర్ మాట్లాడటం లేదని అన్నారు.రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే  కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదు..అమెరికా నుంచి రాగానే ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తాడని అనుకున్నం.. సూర్యాపేట, మహబూబాబాద్ రైతులను కలుస్తడని భావించాం.. కాని కౌశిక్ రెడ్డి అనే శాడిస్ట్, సైకో, పిచ్చి కుక్క లా  స్వైర విహారం చేస్తున్న వ్యక్తి ఇంటికి కేటీఆర్ పోయారని సత్యం విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల అరాచకాలను సాగనివ్వమన్నారు.

అనవసర మాటలు మాట్లాడితే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా చూస్తూ ఉరుకోం..మా సీఎం రేవంత్ రెడ్డి పైన ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఒక్కొక్కరి తాట తీస్తాం…కేటీఆర్ ఒళ్ళు దగ్గరపెట్టుకొ… పిచ్చి పిచ్చి గా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారని సత్యం వార్నింగ్ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button