క్రైమ్

ఫ్రిడ్జ్‌లో యువతి 32 ముక్కలు.. బెంగళూరులో దారుణం

శ్రద్ధావాకర్​ హత్య తరహా కిరాతక ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. మల్లేశ్వరంలో ఉంటున్న 29 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. 32 ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టారు. వయాలికావల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.మృతురాలిని మహాలక్షిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మృతురాలు మహాలక్షికి ఇది వరకే పెళ్లైంది. వ్యక్తిగత కారణాలతో తన బిడ్డతో పాటు మునేశ్వరనగర్‌​లో ఐదు నెలలుగా ఒంటరిగా నివాసం ఉంటోంది. తన భర్త హుకుమ్​ సింగ్​ నేలమంగళలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలికి ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఫోన్​ చేశారు. ఫోన్​ స్విచ్ఛాఫ్​ కావడం వల్ల అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్​ లేబరేటరీ బృందం ఘటనాస్థలిని పరిశీలించారు. కొద్దిరోజుల క్రితం మహిళ హత్యకు గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి ఫ్రిజ్​లో పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.బాధితురాలి ఫోన్​ సెప్టెంబర్​ 2న అయిందని, అదే రోజు హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button