Telangana

దేశానికి ఏం చేశారని మూడోసారి మోదీకి ఓటు వేయాలి… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పదేళ్లు ప్రధానిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికి ఏం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలును కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మోకాలడ్డుతోంది? అని నిలదీశారు. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. మంగళవారం నాడు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కేడర్‌కు లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

Read Also : SRH vs MI ఐపీఎల్ మ్యాచ్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు TSRTC గుడ్‌న్యూస్

కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 ఎంపీ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్నారు. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ వంద రోజుల పరిపాలనకు రెఫరెండమని చెప్పారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి ఏఐసీసీ అగ్రనేత సోనియగాంధీకి కృతజ్ఞత చెబుదామని అన్నారు. గత కేసీఆర్ పాలనలో ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదన్నారు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలును తీసుకురాలేదని చెప్పారు.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్

తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశమని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని చెప్పారు. పార్టీకి అండగా నిలబడి సోనియగాంధీ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నామని తెలిపారు. మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7వ తేదీల్లో జాతీయస్థాయి గ్యారెంటీలను ప్రకటించుకోబోతున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామన్నారు. ఈ జనజాతర సభకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే హాజరవుతారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి :

  1. పైన పటారం.. లోన లొటారం.. నిర్లక్ష్యానికి పరాకాష్టలో మిషన్ భగీరథ పనులు!!!
  2. తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పట్టాలెక్కనున్న డోర్నకల్‌-గద్వాల రైలు మార్గం ప్రాజెక్టు!!!
  3. హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!
  4. వడ్డీ చెల్లించలేదని..నడ్డి విరిచాడు…చంపేస్తానంటూ తన స్టైల్ లో వార్నింగ్..?
  5. మాముళ్ల కోసం లారీ డ్రైవర్ బట్టలు విప్పి కొట్టిన కానిస్టేబుల్స్

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.