Andhra PradeshTelangana

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వ దర్శనానికి 18 గంటలు

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ …

వేసవి సెలవులు బుదవారం ముగుస్తుండటంతో తిరుమలలో వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు . ఈసారి ఎండలు బాగా మండటంతో వేసవిలో సెలవులు వచ్చినప్పటికీ ఎండల దెబ్బకు భయపడిన చాలా మంది భక్తులు అప్పుడు తిరుమల ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక వర్షాలు ప్రారంభమై కాస్త వాతావరణం చల్లబడటంతో ఇప్పుడు తిరుమలకు వెళ్తూ ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 18గంటలు పడుతోంది.ఉచిత స్లాట్ దర్శనానికి ఇచ్చే టిక్కెట్ల కోసం అర్ధ రాత్రి నుంచే శ్రీవారి మెట్లు, శ్రీనివాసం,విష్ణు నివాసం వద్ద భక్తులు పడిగాపులు పడుతున్నారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ ఫుల్గా నిండాయి. .
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నేడు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.